భారత అంతరిక్ష రంగంలో దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు మంత్రి నారా లోకేశ్, ఆయన కుమారుడు నారా దేవాన్ష్‌తో కలిసి షార్‌లోని ‘లాంచ్ వ్యూ గ్యాలరీ’కి విచ్చేశారు. రాకెట్ గాల్లోకి లేచిన సమయం నుంచి అది విజయవంతంగా తన నిర్దేశిత గమ్యాన్ని చేరుకునే వరకు వారు ఆసక్తిగా గమనించారు. అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి చప్పట్లతో సంబరాలు చేసుకున్నారు.