loader

విక్రమ్-1ను విజయవంతంగా పరీక్షించిన స్కైరూట్ ఏరోస్పేస్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మిషన్ ఆగమన్‌లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని సిఎం ప్రశంసించారు. హైదరాబాద్‌కు చెందిన స్పేస్-టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన ఈ విజయం దేశం అంతరిక్ష సాంకేతిక రంగంలో సాధిస్తున్న పురోగతికి నిదర్శనమని, అంతరిక్ష అన్వేషణలో భారత యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే ఘనత స్కైరూట్‌కు దక్కిందని కొనియాడారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON