పదవుల కోసం గాంధీభవన్ కు వచ్చే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సర్ పై నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్ కు రావొద్దన్నారు. కొందరు నేతలు హైదరాబాద్ లో కూర్చొని పనిచేయట్లేదని అసహనం వ్యక్తం చేశారు. సర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించారని, ఇన్ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఇన్ఛార్జీలుగా ఉన్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.