ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఆదివారమే. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30కి మొదలయ్యే పోరులో అర్జెంటీనా, స్పెయిన్ అమీ తుమీ తేల్చుకోబోతున్నాయి. బలాబలాల్లో రెండు జట్లూ సమవుజ్జీలే కావడం.. మేటి జట్లను వెనక్కి నెట్టి ఫైనలు రావడంతో టైటిల్ పోరు హోరాహోరీగా, రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. నాలుగేళ్ల కిందట మెస్సి చేతిలో ప్రపంచకప్ చూసి ఉప్పొంగిపోయిన అర్జెంటీనా అభిమానులు.. దిగ్గజ ఆటగాడికి మరో కప్పుతో వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నారు.