ఇప్పటిదాకా ఒకలెక్క.. ఇక నుంచి మరో లెక్క అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. జంగ్ సైరన్ మోగించడానికి యంగ్ తరంగ్ వచ్చిందని అన్నారు. తెలంగాణ ఉద్యమం యువత వల్లే ఉప్పెనలా మారిందని, మహాద్రోహాన్ని గుర్తు చేసుకోవడానికే ఈ సమావేశం అని తెలియజేశారు. 38 నెలల కిందట ఇదే సరూర్ నగర్ లో దారుణమైన దగా జరిగిందని, కాంగ్రెస్ హామీలతో యువత దగా పడిందని విమర్శించారు.2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు.

