పోలవరం జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలవరం జిల్లా పరిధిలోని గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజన మహిళలు శనివారం రోజువారీ జీవనోపాధిలో భాగంగా గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే నదిలో నీటి మట్టం, ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా ఎక్కువగా ఉండటంతో వారు నియంత్రణ కోల్పోయి నదీ గర్భంలోకి కొట్టుకుపోయారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో ప్రత్యేక పడవలను రంగంలోకి దించి నదిలో గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.