అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫిఫా వరల్డ్ కప్ కల విషాదాంతమైంది. అర్లింగ్టన్‌లో జరిగిన హోరాహోరీ రౌండ్ ఆఫ్ 16 పోరులో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది. 1-0 తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఈ ఓటమితో ఆ జట్టు కేప్టెన్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కేరీర్ కు తెరపడింది. 41 ఏళ్ల రొనాల్డో బాధాకర ఓటమితో తన ఆరో, చివరి ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించాడు. ఈ మ్యాచ్ కు ముందురోజే అతను రిటైర్మెంట్ ప్రకటించాడు.

