కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయం ఆయన
స్వగ్రామానికి చేరుకుంది. హైదరాబాద్లో కన్నుమూసిన ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి అభిమానులు, కాపు సామాజికవర్గ నేతలు, రాజకీయ ప్రముఖులు కిర్లంపూడి నివాసానికి భారీగా తరలివస్తున్నారుశోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులసమక్షంలో ఈరోజు సాయంత్రానికే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.