ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’కు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్లాట్‌ఫారమ్‌లో పైరసీ సినిమాలు, OTT కంటెంట్ విచ్చలవిడిగా చెలామణి అవుతుండటంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఛానళ్లు, కంటెంట్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టెలిగ్రామ్‌ను ఆదేశించింది. అంతేకాకుండా దీనిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని గడువు విధించింది. అనధికారికంగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లను పంపిణీ చేస్తున్న 3,142 టెలిగ్రామ్ ఛానళ్లను గుర్తించింది.