ముంబైలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా భారీ వర్షం పడనున్నది. దీంతో భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముంబై మున్సిపాల్టీ సెలవులు ప్రకటించింది. అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేసింది. విద్యార్థుల సేఫ్టీ నేపథ్యంలో సెలవు ఇస్తున్నట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొన్నది. నగరం అంతా భారీ వానలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావొద్దు అని బీఎంసీ హెచ్చరించింది