ప్రపంచంలోనే తొలిసారి రెండు హ్యుమనాయిడ్ రోబోలు వైద్య రంగంలో సరికొత్త రికార్డు సృష్టించాయి. జీవులపై శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో ఇంజినీర్లు, సర్జన్లు ఈ ప్రయోగం చేపట్టారు. ఓ శస్త్రచికిత్సను వైద్యుడి సాయంతో రోబో చేయగా, మరొక శస్త్రచికిత్సను రెండు రోబోలు కలిసి విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. రోబోలకు ‘సర్జీ’గా పేరుపెట్టారు. ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ ఇప్పుడే మనుషులపై ప్రయోగించలేమని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి.