ప్రముఖ గాయని ఎస్. జానకి మరణవార్త తన హృదయాన్ని కలచివేసిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె అపురూపమైన గాత్రాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. ఎస్. జానకి మృతి పట్ల సినీనటుడు బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధురమైన గళంతో జానకమ్మ సంగీత అభిమానులను అలరించారని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.