ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘ఫు క్వాక్’ ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడటంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు 10 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు, కేరళకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. హనోయిలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) మరణించిన 15 మంది వివరాలను అధికారికంగా విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ మృతులు నల్లపేట ఆదిశేషయ్య రవితేజ, శ్రీధర్ ముడియం,జయలక్ష్మి గెల్లి