భారతీయ సంగీత ప్రపంచంలో గానకోకిల జానకమ్మ స్థానం అద్వితీయం. కేవలం పాట పాడటమే కాదు, ఆ పాటలోని పాత్రలకు అనుగుణంగా తన స్వరాన్ని మార్చడం జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. దీనికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. “రావమ్మ దుర్గమ్మ” (Ravamma Durgamma) అనే ప్రైవేట్ భక్తి గీతంలో జానకమ్మ ఏకంగా నాలుగు విభిన్న గొంతులతో (4 Voices) పాడి శ్రోతలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.