తిరుపతి వేదికగా లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ, లెనిన్ సీమ కథ, సీమలో జరుగుతున్న మహాభారతం అని అన్నారు. మీరు కూడా సినిమా చూసిన తర్వాత లెనిన్తో ప్రేమలో పడతారు. అతడి స్నేహాన్ని, ప్రేమను, పగను ప్రేమిస్తారు. లెనిన్‌ను మీ ఇంటికి తీసుకెళ్తారు. సినిమాలో అఖిల్ కాదు లెనినే కనిపిస్తాడు. జులై 10న వస్తున్నాం, మన వాడు కొడుతున్నాడు’ అంటూ నాగార్జున స్పీచ్ ముగించారు.