ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన భర్తను కావాలని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని బచ్చలకూర అనూష (యూట్యూబర్ రావణ్ భార్య) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ ఓ కొత్త కేసులో ఇరికించి వేధింపులకు పాల్పడటం కంటే తమ కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే తన భర్త కూడా మాట్లాడారని, కానీ కేవలం తన భర్తపైనే కేసులు పెట్టడం వివక్షతో చేస్తున్న కుట్ర అని ఆమె విమర్శించారు.