loader

‘మనవాడు ఈసారి కొడుతున్నాడు’ ‘- లెనిన్ ఈవెంట్లో అక్కినేని నాగార్జున

తిరుపతి వేదికగా లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ, లెనిన్ సీమ కథ, సీమలో జరుగుతున్న మహాభారతం అని అన్నారు. మీరు కూడా సినిమా చూసిన తర్వాత లెనిన్తో ప్రేమలో పడతారు. అతడి స్నేహాన్ని, ప్రేమను, పగను ప్రేమిస్తారు. లెనిన్ను మీ ఇంటికి తీసుకెళ్తారు. సినిమాలో అఖిల్ కాదు లెనినే కనిపిస్తాడు. జులై 10న వస్తున్నాం, మన వాడు కొడుతున్నాడు’ […]

నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్..

సుదీర్ఘ విరామం అనంతరం లెనిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అఖిల్ అక్కినేని, ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. గత రెండున్నర సంవత్సరాలుగా తాను ప్రేక్షకులతో కమ్యూనికేట్ చేయలేకపోయానని, మొహం చూపించలేకపోయానని అన్నారు. లెనిన్ చిత్రం తనను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుందని, తనను “ఇంట్లో వాడిని” చేసుకునేలా చేయాలని కోరారు. “ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చాను, అది లెనిన్” అని ఆయన అన్నారు.

నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన భర్తను కావాలని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని బచ్చలకూర అనూష (యూట్యూబర్ రావణ్ భార్య) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ ఓ కొత్త కేసులో ఇరికించి వేధింపులకు పాల్పడటం కంటే తమ కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే తన భర్త కూడా మాట్లాడారని, కానీ కేవలం తన భర్తపైనే కేసులు పెట్టడం వివక్షతో చేస్తున్న కుట్ర అని ఆమె […]

‘హిందువులను హిప్నటైజ్‌ చేసి దోచుకుంటున్నారు’.. అయోధ్య విరాళాల వివాదంపై ఉద్ధవ్‌ ఠాక్రే

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను హిప్నటైజ్‌ చేసిందని, వారిని దోచుకుంటోందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘హిందువులను దోచుకుంటోందని’ ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందువులను దోచుకుంటున్న ప్రభుత్వం. ఇది కేదార్‌నాథ్-బద్రీనాథ్‌తో మొదలైంది. ఇప్పుడు అయోధ్య వంతు. అయోధ్య ఒక ట్రైలర్ మాత్రమే. కాశీ, మధుర ఇంకా చాలా ఉన్నాయని వారు అంటారు. అక్కడ జరుగుతున్న దోపిడీ గురించి నాకు ఆందోళనగా […]

వయాగ్రా వాడుతున్న ఆటగాళ్లు.. ఇంగ్లండ్ క్లారిటీ

మెక్సికో సిటీలోని ఎత్తయిన ప్రాంత పరిస్థితులకు తట్టుకునేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు వయాగ్రా వాడుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఈ ఔషధంపై ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ నిషేధం లేకపోవడంతో ఆ ప్రచారం మరింత విస్తరించింది. మ్యాచ్ కు ముందు టుచెల్ మీడియాతో మాట్లాడుతూ.. వయాగ్రా వాడుతున్నట్లు సమాచారం తమ వద్ద లేదని, ఆ వార్తలు నిజం కాదని చెప్పారు.హెండర్సన్ కూడా స్పందిస్తూ.. సరదాగా వయాగ్రా ఉపయోగపడినట్లు చెప్పి ఉంటారని.. వెంటనే అది కేవలం జోక్ మాత్రమేనని స్పష్టం చేశాడు. […]

చంద్రబాబు పాలనపై ‘హే రామ్..సేవ్‌ ఆంధ్రప్రదేశ్’ అంటూ వైఎస్‌ జగన్‌ విసుర్లు

చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం పనితీరు ఉందని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. హేరామ్.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ట్విటర్‌ వేదిక ద్వారా చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు. రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు పెడుతున్నారని దుయ్యబట్టారు.

ఫోన్‌ టార్చ్‌ వెలుగులో ఆర్టీసీ బస్సు నడిసిన డ్రైవర్‌.. వీడియో వైరల్‌

కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సు కలబురిగి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించోలి బయలుదేరిన బస్సు చివరి సర్వీసు సమయంలో రాత్రి వేళ హెడ్‌లైట్స్ పని చేయలేదు. బస్సు నడిపేందుకు డ్రైవర్‌ ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో కండక్టర్ తన మొబైల్ ఫోన్‌లోని టార్చ్‌ వెలుగులో రోడ్డు మార్గాన్ని చూపించాడు. దీంతో ఆ డ్రైవర్‌ బస్సు నడిపాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో కర్ణాటక ఆర్టీసీ బస్సుల దుస్థితిపై విమర్శలు […]

స్వాతంత్ర్య వేడుకల వేళ.. న్యూయార్క్‌లో కాల్పుల కలకలం

అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. న్యూయార్క్ లో కాల్పులు కలకలం రేపాయి. బ్రూక్లిన్ సమీపంలోని కోనీ ఐలాండ్లో బాణసంచా ప్రదర్శనను తిలకిస్తున్న వేళ అక్కడి సమూహంపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మైనర్లు సహా ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఓ 21 ఏళ్ల యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు. బాధితులను గుర్తించాల్సి ఉందని, ఆ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని […]

ప్రకాష్ రాజ్ విమర్శలు, బండ్ల గణేష్ ఘాటు కౌంటర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. “ప్రపంచాన్ని మొత్తం నువ్వే నడిపిస్తున్నట్లు వ్యవహరించకు. ముందు నీ బాధ్యతలు, నీ వ్యక్తిత్వాన్ని ఒకసారి నువ్వే పరిశీలించుకో. అతి ప్రవర్తనతో గౌరవం పెరగదు. అణకువగా ఉండటం కూడా అవసరం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ పోస్టు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున […]

నేటికీ.. ఏనాటికీ తెలంగాణకు కాళేశ్వరమే జీవనాడి: కెటిఆర్

ఉద్రిక్తంగా కెటిఆర్ కన్నెపల్లి పర్యటించారు. కెటిఆర్ బృందాన్ని అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చునని, ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి బిఆర్ఎస్ ను అడ్డుకుంటున్నారని విమర్శించారు. కన్నెపల్లి నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతుందని, కన్నెపల్లి వద్ద నీటి లభ్యతను ప్రజలకు చూపించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గోదావరి నీటి కోసం పోరాటం ఈనాటిది కాదని, రైతుల బాధలు చూడలేక కాళేశ్వరం మాజీ సిఎం కెసిఆర్ నిర్మించారని తెలియజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON