ఉద్రిక్తంగా కెటిఆర్ కన్నెపల్లి పర్యటించారు. కెటిఆర్ బృందాన్ని అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చునని, ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి బిఆర్ఎస్ ను అడ్డుకుంటున్నారని విమర్శించారు. కన్నెపల్లి నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతుందని, కన్నెపల్లి వద్ద నీటి లభ్యతను ప్రజలకు చూపించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గోదావరి నీటి కోసం పోరాటం ఈనాటిది కాదని, రైతుల బాధలు చూడలేక కాళేశ్వరం మాజీ సిఎం కెసిఆర్ నిర్మించారని తెలియజేశారు.