అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. న్యూయార్క్ లో కాల్పులు కలకలం రేపాయి. బ్రూక్లిన్ సమీపంలోని కోనీ ఐలాండ్లో బాణసంచా ప్రదర్శనను తిలకిస్తున్న వేళ అక్కడి సమూహంపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మైనర్లు సహా ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఓ 21 ఏళ్ల యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు. బాధితులను గుర్తించాల్సి ఉందని, ఆ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.