కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను హిప్నటైజ్ చేసిందని, వారిని దోచుకుంటోందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘హిందువులను దోచుకుంటోందని’ ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందువులను దోచుకుంటున్న ప్రభుత్వం. ఇది కేదార్నాథ్-బద్రీనాథ్‌తో మొదలైంది. ఇప్పుడు అయోధ్య వంతు. అయోధ్య ఒక ట్రైలర్ మాత్రమే. కాశీ, మధుర ఇంకా చాలా ఉన్నాయని వారు అంటారు. అక్కడ జరుగుతున్న దోపిడీ గురించి నాకు ఆందోళనగా ఉంది’ అని అన్నారు.