యూట్యూబ్‌లో బాసింగా బాసింగా బలాలే వంటి ఫోక్ సాంగ్‌తో ఈశ్వరసాయి ఫేమస్ అయ్యాడు. ఆయనతో పాటు కలిసి నటించిన మరో ఫోక్ డాన్సర్‌తో కొన్నాళ్లుగా వ్యవహారం నడుస్తున్నట్టు అతని భార్య శరణ్య అనుమానించింది. ఫోక్ డాన్సర్‌తో నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఈశ్వర్ సాయి భార్య. వీరిద్దరి అక్రమసంబంధం తెలిసే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు శరణ్య చెబుతోంది. తన భర్తను ట్రాప్‌లోకి లాగి తన సంసారాన్ని నాశనం చేసిందని శరణ్య వాపోయింది.