కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పాత్రపై పాకిస్థాన్‌కు చెందిన మతబోధకుడు నజీర్ మదనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హఫీజ్ సయీద్ ఏకంగా 10,000 మంది ఉగ్రవాదులను కశ్మీర్‌కు పంపాడని ఆయన బహిరంగంగా అంగీకరించారు. పాకిస్థాన్‌లోని బహవాల్‌నగర్‌లో (ఆగస్టు 14న) జరిగిన ఒక బహిరంగ సభలో నజీర్ మదనీ మాట్లాడారు. నిషేధిత ఉగ్ర సంస్థకు చెందిన వేదికపై నుంచే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.