ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిద్ధమవుతున్నారు. బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ని దర్శించుకున్న అనంతరం ఆయన నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు.ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా నిలబడి వారి గొంతును వినిపించేందుకే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ప్రజా వాణిని అసెంబ్లీతో పాటు పార్లమెంట్లోనూ బలంగా వినిపించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.