స్కూల్ విద్యార్థులే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది రెండు తండాలకు చెందిన విద్యార్థులు హత్య చేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సదరు విద్యార్థులు గంజాయి తీసుకుంటుండగా ఆమె ఫొటోలు తీయడంతో పాటు వీడియోలు కూడా తీసిందనే అనుమానంతోనే ఆమెను చంపినట్టు తెలుస్తోంది. గంజాయి సేవిస్తుండగా విద్యార్థులను పిలిచి రూపారెడ్డి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. దీంతోనే విద్యార్థులు రూపారెడ్డిని హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.