బీహార్‌లోని నలంద జిల్లా నూర్ సరాయ్ పరసి మిడిల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనంలో ఉప్పుకు బదులుగా సర్ఫ్ కలపడంతో 40 మంది పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోయాబీన్ కూరలో ఉప్పు తక్కువగా ఉండటంతో సిబ్బంది ఉప్పు డబ్బా అనుకుని పొరపాటున డిటర్జెంట్ పౌడర్‌ను కూరలో కలిపి విద్యార్థులకు వడ్డించారు. ఆ ఆహారాన్ని తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బంది పడి కళ్లు తిరిగి పడిపోయారు.