తెలంగాణలో పోలీస్ ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి అభ్యర్థికి ప్రత్యేకమైన యూనిక్ ఐడీని కేటాయిస్తోంది. దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థి ఎదుర్కొనే ప్రతి దశకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఐడీలో నమోదు చేయనున్నారు. ఇందులో ఫామ్-ఏ, ఫామ్-బీతో కూడిన ప్రత్యేక ప్రొఫార్మాను సిద్ధం చేస్తున్నారు. ప్రతి దశలో అభ్యర్థి సాధించిన మార్కులు, శారీరక సామర్థ్యం, అర్హతలు తదితర వివరాలను యూనిక్ ఐడీతో అనుసంధానం చేయనున్నారు.

