భారత అంతరిక్ష రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. సుమారు 1,600 లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ప్రయోగించాలన్న రిలయన్స్ జియో ప్రణాళికకు, భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ అయిన IN-SPACe నుండి సాంకేతిక ఆమోదం లభించినట్లు సమాచారం. జియో శాటిలైట్ నెట్‌వర్క్ భవిష్యత్తులో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ టవర్లకు బ్యాక్‌హాల్ సేవలు, మొబైళ్లకు డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ వంటి సేవలను అందించగలదు. ఇందుకోసం దేశవ్యాప్తంగా సుమారు 20 నుండి 22 గ్రౌండ్ స్టేషన్లను నిర్మించాలని కూడా కంపెనీ యోచిస్తోంది.