తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ అంటూ ఆమె విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి వారసుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత YCP మోసాలను తూచ తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ విధానం అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
కోతల రాయుడు కోతలని ఎద్దేవా చేసిన బాబుగారే మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.