loader

ఎయిర్‌ఫోర్స్ వ‌న్ ఎక్కి.. ఫుడ్‌ ట్ర‌క్కులోకి మారి..

ఖ‌తార్ బ‌హూక‌రించిన ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానంలో ట‌ర్కీ చేరుకున్న ట్రంప్‌.. బెదిరింపుల నేప‌థ్యంలో త‌న రిట‌ర్న్ జ‌ర్నీలో పాత ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌లో వెళ్తాన‌ని ప్ర‌క‌టించారు. తొలుత అంద‌రి ముందు పాత ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానాన్ని ఎక్కిన‌ట్లు చేశారు. ఆ విమానం లోప‌లికి వెళ్లిన త‌ర్వాత ఆ విమానం వెనుక ఉన్న ఓ కేట‌రింగ్ ట్ర‌క్కులోకి మారారు. ఆ త‌ర్వాత ఆ ఫుడ్ ట్ర‌క్కు.. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-32ఏ విమానం వ‌ద్ద‌కు వెళ్లింది. కేట‌రింగ్ ట్ర‌క్కు […]

లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకున్న విప‌క్షాలు.. స‌భ‌ 2 గంట‌ల‌కు వాయిదా

స‌మావేశాలు స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని విప‌క్ష‌ల‌ను ఇవాళ లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కోరారు. స‌భా నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా జ‌రిగితే.. నిర్మాణాత్మ‌క రీతిలో చ‌ర్చ‌లు జ‌రుగుతాయని, దీంతో బిల్లుల‌ను పాస్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. మంగ‌ళ‌వారం కూడా లోక్‌స‌భ‌లో ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగింది. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని అడ్డుకోవ‌డంతో స్పీక‌ర్ విప‌క్షాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రో వైపు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఎన్డీఏ స‌భ్యులు.. జార్ఖండ్‌లో జ‌రిగిన విద్యార్థుల‌పై లాఠీఛార్జ్ ఘ‌ట‌న‌ను వ్య‌తిరేకిస్తూ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు

SIR:ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

SIR ప్రక్రియలో భాగంగా తన ఓటు హక్కును తొలగించడంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన తన ఓటును తొలగించడం వెనుక రాజకీయం ఉందో లేక సాంకేతిక లోపమో స్పష్టం కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. నేను బెంగళూరు నియోజకవర్గంలోనే పుట్టి పెరిగాను. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా కూడా పోటీ చేశాను. కానీ ఇప్పుడు SIR ప్రక్రియ పేరుతో అదే నియోజకవర్గంలో నా ఓటు […]

‘మంగళ్ మిలన్’లో మోదీ కీలక భేటీ.. ప్రతిపక్ష వ్యూహానికి కౌంటర్‌పై NDA మంతనాలు

పార్లమెంట్‌లో కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి కీలక వ్యూహ సమావేశం నిర్వహించింది. ఇప్పటివరకు NDA Parliamentary Party Meetingగా పిలిచిన ఈ వారపు సమావేశానికి ‘మంగళ్ మిలన్’ అనే కొత్త పేరు పెట్టారు. సమావేశంలో NDA ఎంపీలు ప్రధానమంత్రి మోదీతో కలిసి త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు. NDA బహుపక్ష కూటమి కావడంతో భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశం కీలకంగా పనిచేస్తుంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఆర్డినెన్సులు, వాటిపై చర్చలు, […]

పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్

ఆగస్టు 15న ఎర్రకోటలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి.ఇందులో భాగంగా ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదాతో పాటు ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల వివరాలతో పోస్టర్లను సిద్ధం చేశారు. ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వంటి సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదుల వివరాలు […]

వ‌ల‌స‌దారుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్న అమెరికా

వలసలను అరికట్టేలా ఇప్పటికే ఉన్న అన్ని విధానాలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేయ‌నుంది. గ్రీన్‌కార్డు, పౌరసత్వం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. మెరుగైన సేవలు అందించేందుకు, నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ‘యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌’ ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. గ్రీన్‌కార్డు దరఖాస్తులు, రెన్యువల్స్‌, ఫ్యామిలీ బేస్డ్‌ పిటిషన్‌లు, పౌరసత్వం కోసం, ఆశ్రయం కోసం చేసుకునే అభ్యర్థనలు, ఉపాధి అనుమతి దరఖాస్తులు, తాత్కాలిక రక్షిత హోదా ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఈ ఆన్‌లైన్ […]

జాంబీ డ్రగ్ వీడియోతో పంజాబ్‌లో.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను పంజాబ్‌లో ‘జాంబీ డ్రగ్’ సమస్యకు నిదర్శనంగా పేర్కొంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. యితే ఆ వీడియో పంజాబ్‌కు చెందినది కాదని.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో చిత్రీకరించిందని పంజాబ్ మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ స్పష్టం చేశారు. హర్భజన్ సింగ్ షేర్ చేసిన వీడియోలో తలపాగాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై తడబడుతూ, నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు.

ఉద్యోగార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా జార్ఖండ్‌ బంద్

జార్ఖండ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాన్ని నిరసిస్తూ మంగళవారం (ఆగస్టు 11) భారతీయ జనతా పార్ట పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌తో పలు జిల్లాల్లో సాధారణ జీవనం తీవ్రంగా ప్రభావితమైంది. రాజధాని రాంచీతో పాటు ప్రధాన నగరాల్లో పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడగా, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం 8:00 గంటల నుండి అర్ధరాత్రి 12:00 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుందని, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు […]

ఝార్ఖండ్లో 18 వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన

ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్షలు (JPSC, JSSC) మరియు ఫలితాల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, ఉద్యోగార్థులు చేపట్టిన నిరసన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి 18వ రోజుకు చేరుకున్నాయి. పరీక్షల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, కేవలం కొన్ని పరీక్షలను రద్దు చేసి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, దీనిపై CBI విచారణ చేపట్టాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తోంది.

ఏఐతో భారీగా ఉద్యోగాల సృష్టి : జుకర్‌బర్గ్‌

మెటా 8,000 మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని వారాల తర్వాత, ఏఐ పుష్కలంగా ఉద్యోగాలను సృష్టిస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ అన్నారు. ఏఐ భారీ నిరుద్యోగానికి కారణం కాకుండా, పుష్కలంగా ఉద్యోగాలను సృష్టిస్తుందని జుకర్బర్గ్ విశ్వాసం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఏఐతో చిన్న బృందాలే పెద్ద వ్యాపారాలను నడుపుతాయన్నారు. విస్తృత పునర్నిర్మాణంలో భాగంగా మెటా ఇటీవల ఉద్యోగులను తొలగించిన కొన్ని వారాలకే ఈ వ్యాఖ్యలను బ్లాగ్ పోస్ట్ చేయడం గమనార్హం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON