SIR ప్రక్రియలో భాగంగా తన ఓటు హక్కును తొలగించడంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన తన ఓటును తొలగించడం వెనుక రాజకీయం ఉందో లేక సాంకేతిక లోపమో స్పష్టం కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. నేను బెంగళూరు నియోజకవర్గంలోనే పుట్టి పెరిగాను. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా కూడా పోటీ చేశాను. కానీ ఇప్పుడు SIR ప్రక్రియ పేరుతో అదే నియోజకవర్గంలో నా ఓటు హక్కును తొలగించారు అని వీడియోలో పేర్కొన్నారు.