వలసలను అరికట్టేలా ఇప్పటికే ఉన్న అన్ని విధానాలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేయనుంది. గ్రీన్‌కార్డు, పౌరసత్వం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. మెరుగైన సేవలు అందించేందుకు, నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్’ ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. గ్రీన్‌కార్డు దరఖాస్తులు, రెన్యువల్స్, ఫ్యామిలీ బేస్డ్ పిటిషన్‌లు, పౌరసత్వం కోసం, ఆశ్రయం కోసం చేసుకునే అభ్యర్థనలు, ఉపాధి అనుమతి దరఖాస్తులు, తాత్కాలిక రక్షిత హోదా ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఈ ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.