ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్షలు (JPSC, JSSC) మరియు ఫలితాల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, ఉద్యోగార్థులు చేపట్టిన నిరసన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి 18వ రోజుకు చేరుకున్నాయి. పరీక్షల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, కేవలం కొన్ని పరీక్షలను రద్దు చేసి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, దీనిపై CBI విచారణ చేపట్టాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తోంది.