రాజధానిలో ఓటర్ల సంఖ్యకు భారీగా కోత పడింది. SIRలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ గడువు సోమవారంతో పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల ఎన్నికల అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మూడు జిల్లాల పరిధి 28 నియోజకవర్గాల్లోని 1.14 కోట్ల ఓటర్ల సంఖ్య 71లక్షలకు తగ్గింది. రెండు, మూడు నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉండటం, చిరునామా మారడం, చనిపోవడం వంటి కారణాలతో ఫారాలను తిరిగివ్వలేదనే కారణంతో అధికారులు లక్షల మంది ఓటరు గుర్తింపు కార్డులను రద్దు కేటగిరీలో చేర్చారు.