కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రత నమోదైంది. భారీగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విపత్తు ప్రభావం ఒక్క కొలంబియాలోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న ఈక్వెడార్ రాజధాని క్విటో నగరంతో పాటు.. సుదూరంగా ఉన్న పనామా దేశంలోనూ ప్రజలు ఈ ప్రకంపనల ధాటికి ఇళ్లలోంచి బయటకు వచ్చారు.వెనిజులా సరిహద్దు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.