కర్రెగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో పర్యటించిన ఆయన.. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 50 ఏళ్ల తర్వాత ఇక్కడ శాంతి నెలకొందన్నారు. ఆపరేషన్ కగార్ చర్యలతో మావోయిస్టు ప్రభావం తగ్గిందని, ఇప్పటి వరకు 700 మంది మావోలు లొంగిపోయారని చెప్పారు. కర్రెగుట్టలో శాంతి పునరుద్ధరణలో సీఆర్పీఎఫ్ 196 బెటాలియన్ సేవలు కీలకమైనవన్నారు.