ఢిల్లీలోని శివమార్కెట్ లో ఉన్న మూడు మోసపూరిత సైబర్ కాల్ సెంటర్ల పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దాడి చేశారు. 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలీకాలర్లను అదుపులోకి తీసుకున్నారు. బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ప్రాసెసింగ్, వెరిఫికేసన్, బీమా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెలీకాలర్లలో పలువురు కోరుట్ల, హైదరాబాద్లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్ నగర్ ప్రాంతాలకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.