డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం తరపున ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నన్నీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో సభా వేదికపైనే కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.