ఒంగోలులో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తెదేపా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యవహారంపై రెండు పార్టీల హైకమాండ్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని తెదేపా, జనసేన అధిష్ఠానాలు ఆదేశాలు జారీ చేశాయి. తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. ఆరోపణలుంటే పార్టీల అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని ఇద్దరు నేతలనూ కమిటీ కోరింది. ఈ మేరకు దామచర్లకు అచ్చెన్నాయుడు, మరోవైపు బాలినేనికి జనసేన అగ్రనేతలు ఫోన్ చేశారు.