మెగా డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలు చేపట్టింది. మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావాన్ని తెలియజేయడానికి తాడిపత్రికి బయలుదేరి వెళ్లిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జీ చేయించిన కేంద్ర ప్రభుత్వమే చివరికి దిగొచ్చిందని, మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. మరోవంక గుంటూరులో పోలీసులకు పూలను ఇచ్చి మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన తెలిపారు.