loader

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం రేట్లు

బంగారం ధరలు ఎన్నడూ లేనివిధంగా ఆకాశాన్నంటుతున్నాయి. సోమవారం (ఆగస్టు 10) ఉదయం నాటికి హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 1,52,340 వద్ద ట్రేడవుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,640 వద్ద స్థిరపడింది.తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో హైదరాబాద్‌తో సమానంగా ధరలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ. […]

మలేషియా ఎయిర్ లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి 159 మంది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం (MH184) కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా విమాన కాక్‌పిట్‌పై శక్తివంతమైన లేజర్ కిరణాలు పడ్డాయి. ఈ అకస్మాత్తు వెలుగుల వల్ల పైలట్ దృష్టి చెదిరే ప్రమాదం ఏర్పడింది.పైలట్ వెంటనే అప్రమత్తమై ల్యాండింగ్‌ను నిలిపివేయడంతో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. లేజర్ వెలుగులను ఎవరు ప్రసరింపజేశారనే దానిపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులతో పాటు స్థానిక విస్తృతంగా దర్యాప్తు చేపడుతున్నారు.

ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతల వేళ, ఇరాన్ సైన్యం వాషింగ్టన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. “ఏ అమెరికన్ సైనిక సిబ్బంది అయినా ఇరాన్‌లో అడుగుపెడితే, మేము వారిని అడ్డుకుంటాము, నరికేస్తాం” అని ఆయన అన్నారు. శత్రువు చేపట్టే ఎలాంటి చర్యకైనా గట్టిగా, సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, ఇరాన్‌లోకి ప్రవేశించే ఏ విదేశీ సైనిక దళానికైనా తక్షణమే, కఠినంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ సైన్య భూతల దళాల కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహన్‌షాహి ఆదివారం […]

అర్ధరాత్రి ‘పెద్ది’ విగ్రహ గద్దె కూల్చివేత!

దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. సంబంధిత అనుమతులు లేవన్న కారణం అధికారులు దానిని తొలగించినట్లు సమాచారం. రాత్రివేళ గద్దెను కూల్చివేసిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు గద్దె నిర్మిస్తే రాత్రి సమయంలో కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు.

తెలంగాణ స‌ర్కార్ వ‌రుణ‌యాగం ప్రారంభం!

ఎల్ నినో ఎఫెక్ట్ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసి, రైతాంగం, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో వరుణయాగాన్ని చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఈ జరుగుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున యాగాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON