దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. సంబంధిత అనుమతులు లేవన్న కారణం
అధికారులు దానిని తొలగించినట్లు సమాచారం. రాత్రివేళ గద్దెను కూల్చివేసిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్
స్థలంలో విగ్రహ ఏర్పాటుకు గద్దె నిర్మిస్తే రాత్రి
సమయంలో కూల్చివేయాల్సిన అవసరం
ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు.

