ఎల్ నినో ఎఫెక్ట్ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసి, రైతాంగం, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో వరుణయాగాన్ని చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఈ జరుగుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున యాగాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి
మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

