ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతల వేళ, ఇరాన్ సైన్యం వాషింగ్టన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. “ఏ అమెరికన్ సైనిక సిబ్బంది అయినా ఇరాన్‌లో అడుగుపెడితే, మేము వారిని అడ్డుకుంటాము, నరికేస్తాం” అని ఆయన అన్నారు. శత్రువు చేపట్టే ఎలాంటి చర్యకైనా గట్టిగా, సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, ఇరాన్‌లోకి ప్రవేశించే ఏ విదేశీ సైనిక దళానికైనా తక్షణమే, కఠినంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ సైన్య భూతల దళాల కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహన్‌షాహి ఆదివారం తెలిపారు

