ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచ్‌ల కోసం లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I కేటగిరీ కింద మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు ప్రధానంగా నాలుగు రాష్ట్రాల్లో. తమిళనాడులో 100, కర్ణాటకలో 50, మహారాష్ట్రలో 50, గుజరాత్‌లో 50 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు కేవలం ఏదో ఒక రాష్ట్రానికి మాత్రమే,ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఈ పోస్టులకు అర్హులు.