జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్య ఏజెంట్గా చెప్పుకున్న నకిలీ ఐఏఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న టెస్లా కారుతో సహా విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బీహార్లోని ఖగారియా జిల్లాగోగ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్పూర్లో నివసిస్తున్న మనీష్ గుప్తా, ఐఏఎస్ అధికారిగా చెలామణి అవుతున్నాడు. ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న, పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ ఉన్న ఖరీదైన టెస్లా కారులో బీహార్ అంతటా అతడు తిరుగుతున్నాడు.