రాజమండ్రి నగర శివారులో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర కలకలం రేగింది. కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహంతోపాటు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడిని స్థానికులు గుర్తించారు. యువకుడిని కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్‌గా, యువతిని శాంతినగర్ నివాసిగా గుర్తించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.