సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షలను ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. సభా నిర్వహణ సక్రమంగా జరిగితే.. నిర్మాణాత్మక రీతిలో చర్చలు జరుగుతాయని, దీంతో బిల్లులను పాస్ చేసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. మంగళవారం కూడా లోక్‌సభలో ప్రతిష్టంభన కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవడంతో స్పీకర్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ సభ్యులు.. జార్ఖండ్‌లో జరిగిన విద్యార్థులపై లాఠీఛార్జ్ ఘటనను వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేపట్టారు