తెలంగాణ సెట్‌కు దరఖాస్తులు షురూ
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(TG SET)-2026కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు తమ ఆధార్, పీజీ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలను ఎంటర్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 1న సెట్ నోటిఫికేషన్ జారీ కాగా.. నేటి నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29, 30 తేదీల్లో జరిగే ఈ పరీక్షలకు సెప్టెంబర్ 24 నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

