గుంటూరు జిల్లాలో హోం డిపార్ట్మెంట్ పూర్తిగా పెమ్మసాని జేబులోనే ఉందని, ఆయన కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం నడుస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. “నా ఇంటిపై దాడి చేసే సమయంలో 24 గంటల్లో సినిమా చూపిస్తా అని పెమ్మసాని ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయనకు తప్పు చేశాననే భావన ఉంది.. ఎందుకంటే ఆయన ఒక నేరస్థుడు అని మండిపడ్డారు. నేను నల్లపాడు స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడి ఇద్దరు సీఐలకు పెమ్మసాని స్వయంగా ఫోన్ చేశారా లేదా? అంటూ సవాల్ విసిరారు