పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో ఏనుగుల గుంపు తీవ్ర అలజడి సృష్టిస్తోంది. గతంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో తిరిగిన ఏనుగులు ఇప్పుడు ఆంధ్ర భూభాగంలోకి ప్రవేశించి పంట తోటలను ధ్వంసం చేస్తుండటంతో స్థానిక గిరిజన గ్రామాలు భయాందోళనలో మునిగిపోయాయి. భామిని – మనము కొండ గ్రామాల మధ్య సంచరిస్తున్న ఏనుగుల గుంపు పామాయిల్, మామిడి, జీడిమామిడి తోటలను తొక్కిపారేసింది. ఖరీఫ్ సీజన్ కావడంతో పంట పొలాల్లో పనులకు వెళ్లాల్సిన గిరిజన రైతులు ఏ క్షణంలో ఏనుగులు దాడి చేస్తాయోనని భయపడుతున్నారు.